చిరంజీవి రీమిక్స్ సినిమాలు చేయడానికి కారణం అదేనట..!!

Divya
చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాలలో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రాలన్నీ కేవలం  కొన్ని రోజుల గ్యాప్ లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అయితే తాజాగా ఈ చిత్రాల గురించి చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. రీయంట్రీ ఇచ్చినప్పటినుంచి ఎక్కువగా రీమేక్ సినిమాలలోనే నటిస్తూ ఉన్నారు చిరంజీవి. అలా నటించడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.
కథల కొరత వల్ల రీమేక్ లు చేయడం లేదని చిరంజీవి తెలియజేశారు.  ప్రేక్షకులకు మాపై భారీ అంచనాలు ఉన్నాయి అని చిరంజీవి తెలియజేయడం జరిగింది. రమణ రీమేక్ ఠాగూర్ కు డైరెక్టర్ గా మొదట మురగదాస్ పేరును పరిశీలించామని తెలియజేశారు. తమిళంలో తీసినట్లు టాగూర్ ను తెలుగులో తీస్తే సినిమా ప్లాప్ అవుతుందని భారీ బడ్జెట్ తో సినిమాలు తీసుకున్న సమయంలో అదే స్థాయిలో కలెక్షన్లు వచ్చేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తాను తెలియజేసినట్లుగా చిరంజీవి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితులలో కచ్చితంగా సేఫ్ అనిపించే చిత్రాలను మాత్రమే రీమేక్ చేయడం కరెక్ట్ అని చిరంజీవి తెలియజేశారు.
ఇక 2023వ సంవత్సరం మార్చి నుంచి తన కొత్త సినిమాలు మొదలవుతాయని తెలియజేశారు.  బాబి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న చిత్రంలో తన పాత్ర చాలా మాస్ గా ఉంటుందని చిరంజీవి కామెంట్ చేయడం జరిగింది.  ఈ చిత్రంలోని డైలాగ్స్ అన్నీ తూర్పుగోదావరి యాసలో ఉంటుందని చిరంజీవి తెలియజేయడం జరిగింది. తాను కూడా గోదావరి యాసలో మాట్లాడానని చిరంజీవి తెలిపారు.  ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేశామని తెలిపారు. ఇక  ప్రస్తుతం చిరంజీవి తన కథల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా తనకు కథ నచ్చితే ఎలాంటి సినిమా నైనా తెరకెక్కించడానికి ముందుకు వస్తున్నారు.  అది కూడా తన బ్యానర్లో నిర్మించడానికి ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: