అన్నీ త్యాగం చేసినా అణిగిమణిగి ఉన్న రోహిత్‌, ఓ మెట్టు ఎక్కేశాడు...!!

murali krishna
బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది. ఈపాటికే కెప్టెన్సీ కంటెండర్ల పోటీ ముగిసింది.
అయితే ఈ కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో సుదీప బంతి తీసుకుని తన బాస్కెట్‌లో కాకుండా రోహిత్‌ బాస్కెట్‌లో వేసింది. దీంతో అతడు కెప్టెన్‌ బరిలో నిలిచాడు. తన గేమ్‌ తను ఆడకుండా వేరొకరికి ఎందుకు సపోర్ట్‌ చేయడమని ఫైమా, కీర్తి.. సుదీపపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తన ఫ్రెండ్స్‌ అయిన ఇనయ, సూర్య తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని బాధపడింది ఫైమా.
 
అనంతరం రేవంత్‌, శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్‌, అర్జున్‌, రోహిత్‌, సూర్య, వసంతిలకు బిగ్‌బాస్‌ 'ఆఖరి వరకు ఆగని పరుగు' అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో పూలకుండీల మీద కంటెండర్ల ఫొటోలు అతికించి ఉంటాయి. బజర్‌ మోగినప్పుడు పోటీదారులు వారి పూలకుండీ కాకుండా ఇతరులది ఏదైనా పూలకుండీ తీసుకుని కంటెండర్‌ జోన్‌లోకి వెళ్లాలి. చివరగా కంటెండర్‌ జోన్‌లోకి వెళ్లిన పోటీదారుతోపాటు, అతడి చేతిలో ఏ సభ్యుడి పూలకుండీ ఉంటుందో.. ఆ ఇద్దరిలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేస్‌ నుంచి తొలగించే బాధ్యత ఇంటిసభ్యులకు అప్పగించాడు బిగ్‌బాస్‌.
 
మొదటి రౌండ్‌లో రాజ్‌ తన పూలకుండీ తానే తెచ్చుకోవడంతో పోటీలో అనర్హుడయ్యాడు. తర్వాత వసంతి, రేవంత్‌, అర్జున్‌, శ్రీసత్య, ఆది రెడ్డి వరుసగా గేమ్‌లో నుంచి వైదొలిగారు. చివరగా పోటీలో సూర్య, రోహిత్‌ మిగిలారు. మెజారిటీ ఇంటిసభ్యులతో పాటు మెరీనా కూడా సూర్యకే ఓటేసింది. చివరగా ఇనయకు ఓటేసే వంతు రాగా నా ఓటు అన్నయ్యకా? బావకా? అని మెలికలు తిరిగింది. అయినా అందరూ ఊహించినట్లుగానే సూర్యకే మద్దతిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం సూర్య కెప్టెన్‌గా అవతరించాడు. అనంతరం రాత్రిపూట కర్వా చౌత్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు మెరీనా- రోహిత్‌. సాంప్రదాయ దుస్తులు ధరించిన మెరీనా జల్లెడలో చంద్రుడిని చూసి, ఆ వెంటనే తన భర్త రోహిత్‌ను చూసింది. అనంతరం భర్త పాదాలు తాకి అతడి ఆశీర్వాదం తీసుకుంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఓ సాంగ్‌ ప్లే చేయడంతో ఇంటిసభ్యులంతా చిందులేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: