6వ వారం ఓటింగ్ తారుమారు.. ఆ ఇద్దరికీ షాక్.. ఈ సారి ఎలిమినేట్ ఎవరంటే....!!

murali krishna
గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో నడుస్తున్నా.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుని.. తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్.ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అవుతోన్నా దీనికి స్పందన భారీగానే పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే ఆరో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇది మాత్రం గతంలో వాటికంటే చప్పగా సాగుతోంది. కానీ, ఎలిమినేషన్స్ మాత్రం ట్విస్టులతో సాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఆరో వారం ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఈ సారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? చూద్దాం పదండి!
అంతా కొత్తగానే.. రేటింగ్ మాత్రంఒకటి కాదు.. రెండు కాదు.. ఆరేళ్లుగా తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఇప్పుడు వస్తున్న ఆరో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీనికి ఆదరణ దక్కడం లేదు. దీంతో ఈ షోకు రేటింగ్ కూడా ఆశించిన స్థాయిలో రావట్లేదనే చెప్పాలి.
ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌లు ఎంటరయ్యారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటిలు ఎలిమినేట్ అయ్యారు.
ఆరో వారం 9 మంది నామినేషన్
తాజా సీజన్‌లోని ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. మరీ ముఖ్యంగా కొందరు చిత్ర విచిత్రమైన పాయింట్లను తీసుకు వచ్చి గొడవలు పెట్టుకున్నారు.. ఇలా ఈ టాస్కులో 9 మంది అంటే.. ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, ఆది రెడ్డి, సుదీప పింకీ, గీతూ రాయల్‌లు నామినేట్ అయ్యారు.
ఓటింగ్ తారుమారు.. స్థానాల్లోనూ
గతంలో పోలిస్తే ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ ఊహించని విధంగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకూ దీని నుంచి వెళ్లిన వాళ్లలో పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరో వారంలో కూడా ఓటింగ్ ఎన్నో మార్పులతో సాగుతోంది. దీంతో రోజురోజుకూ కంటెస్టెంట్ల స్థానాలు తారామారు అవుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది.
టాప్‌లో అతడే.. రెండో స్థానంలో
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్ మొదటి రోజు నుంచి చాలా మార్పులతో సాగుతోంది. కానీ, మొదటి రెండు స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా కనిపించడం లేదని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయట. రెండో స్థానంలో మాత్రం యూట్యూబర్ ఆది రెడ్డి కొనసాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు
తాజాగా జరుగుతోన్న ఓటింగ్‌లో చాలా ట్విస్టులు కనిపించడంతో కంటెస్టెంట్ల స్థానాల్లోనూ మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్స్ చూస్తే.. కీర్తి భట్ మూడో స్థానంలో, గీతూ రాయల్ నాలుగో స్థానంలో, శ్రీ సత్య ఐదో స్థానంలో, బాలాదిత్య ఆరో స్థానంలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంటే.. ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే వీళ్లంతా సేఫ్ అవుతారని అంటున్నారు.
డేంజర్‌ జోన్‌లో ఉన్నది ఎవరు?
బిగ్ బాస్ ఆరో సీజన్ ఆరో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రస్తుతం రాజశేఖర్ ఏడో స్థానంలో ఉన్నాడని తెలిసింది. అలాగే, సుదీప పింకీ, మెరీనా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారట. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇది బిగ్ బాస్ కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: