ఆకట్టుకుంటున్న సందీప్ కిషన్.. మజిలీ హీరోయిన్ పోస్టర్..!!

Divya
టాలీవుడ్ లో యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మజిలీ హీరోయిన్ దివ్యంక కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్నది. ఇక ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు. ఇక విలన్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటిస్తూ ఉన్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక అద్భుతమైన ఫిజిక్ తో ఈ సినిమాలో యువ హీరో సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారు సందీప్ కిషన్.

అయితే ఈ రోజున మేకర్ స్పైసి పోస్టర్ని రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మైఖేల్ సినిమా టీజర్ ని అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు తాజాగా ఒక రొమాంటిక్ అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది.ఇందులో దివ్యాంక కౌశిక్ ని ఒక బైక్ మీద కూర్చోబెట్టి సందీప్ కిషన్ ఆమెతో గాఢమైన లిప్ లాక్ ఇస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్లుగా ఈ పోస్టర్ను చూస్తే మనకు అర్థమవుతొంది.

బ్యాక్ గ్రౌండ్లో ఎగిరే పక్షులతో ఇది చాలా రొమాంటిక్గా కనిపిస్తున్నది. సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. ఇక సెకండ్ లుక్కుల చాలా ఘాటైన లిప్ లాక్ ని ఆవిష్కరించినట్లుగా మేజర్.. మరి టీజర్ లో ఎలాంటి విషయాలను తెలియజేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ,వరుణ్ సందేశ్, అనసూయ తదితరులు కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మైఖేల్ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రంతోనైనా హీరో సందీప్ కిషన్ కెరియర్ మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: