అవును నా ముక్కుకి సర్జరీ జరిగింది : శృతి హాసన్

murali krishna

శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సౌత్ లో ఆమె క్రేజీ హీరోయిన్. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. ఆ ముద్ర చెరిపివేయడానికి శృతి హాసన్ కి ఎంతో సమయం పట్టలేదు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించిందట..


ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా ఆమె మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి.


గతంలో మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో డేటింగ్ చేసిన శృతి హాసన్.. చివరకి అతడి నుంచి విడిపోయిందట.. ప్రస్తుతం శాంతను అనే యువకుడి ప్రేమలో ఉంది. శృతి హాసన్ తరచుగా శాంతనుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకి దర్శనం ఇస్తూ ఉంటుంది.


తాజాగా శృతి హాసన్ తన బాడీ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. కొన్నేళ్లుగా శృతి హాసన్ ముక్కు విభిన్నంగా సన్నగా కనిపిస్తోందట.. ఆమె ప్రారంభ చిత్రాల్లో ఉన్నట్లు ఇప్పుడు ముక్కు లేదు. దీనితో శృతి హాసన్ అందం కోసం ముక్కుకి సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం కూడా జరిగింది.


దీని గురించి శృతి హాసన్ తాజాగా ఇంటర్వ్యూలో బదులిచ్చింది. నిజమే.. నా ముక్కుకి సర్జరీ జరిగింది. అయితే దీని గురించి నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాస్తవం చెప్పాలి. అంతా అనుకున్నట్లు నేను అందం కోసం సర్జరీ చేయించుకోలేదు.


నా ముక్కుకి గాయం ఐంది. దీనితో తప్పని పరిస్థితుల్లో సర్జరీ జరిగింది. అందువల్లే నా ముక్కు మునుపటిలా లేదు అని శృతి హాసన్ క్లారిటీ ఇచ్చిందట.. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో క్రేజీ చిత్రాలు ఉన్నాయి. బాలకృష్ణ సరసన గోపీచంద్ మలినేని చిత్రంలో, చిరంజీవి సరసన డైరెక్టర్ బాబీ చిత్రంలో, ప్రభాస్ సరసన సలార్ చిత్రాల్లో శృతి హాసన్ నటిస్తోందట..ఇదిలా ఉండగా రీసెంట్ గా కూడా శృతి హాసన్ తన ప్రియుడితో ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. శాంతనుని హగ్ చేసుకుంటూ రొమాంటిక్ గా ఫోటోలకు  ఆమె  ఫోజులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: