'బింబిసార' జోష్​తో కల్యాణ్​రామ్ కొత్త మూవీ.. మాలీవుడ్​లోకి 'ఉప్పెన' బ్యూటీ

murali krishna
'బింబిసార'తో విజయాన్ని అందుకున్న నందమూరి కల్యాణ్‌రామ్‌ తదుపరి సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే గోవాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.
త్వరలోనే చివరి షెడ్యూల్‌ మొదలు కానుందని సినీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తోన్న హీరోయిన్ కృతి శెట్టి.. మలయాళం చిత్రసీమలోకి అడుగుపెట్టనుంది.
బింబిసార'తో విజయాన్ని అందుకున్న నందమూరి కల్యాణ్‌రామ్‌ తదుపరి సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమది. కల్యాణ్‌రామ్‌ సరసన ఆషిక రంగనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. ఇటీవలే గోవాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. త్వరలోనే చివరి షెడ్యూల్‌ మొదలు కానుందని సినీ వర్గాలు తెలిపాయి.
కల్యాణ్‌రామ్‌ 19వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ఆయన మూడు పాత్రల్లో కనిపిస్తారని, 'ఎమిగోస్‌' అనే పేరుని పరిశీలిస్తున్నారని తెలిసింది. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాశ్‌, మాథ్యూ వర్గీస్‌, రాజీవ్‌ పిళ్లై, రవిప్రకాశ్‌, శివన్నారాయణ, చైతన్యకృష్ణ, రఘు కారుమంచి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌రాజన్‌, సంగీతం: జిబ్రాన్‌.
మలయాళంలోకి కృతిశెట్టి..
తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచిన కథానాయిక కృతిశెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తోంది. ఇటీవలే తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టి, అక్కడ సూర్యతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారామె. ఈ రెండు భాషల్లోనే కాదు.. మలయాళంలోనూ ఆమె పరిచయం అవుతోంది. టొవినో థామస్‌తో కలిసి 'అజయంతే రందం మోషణం'అనే చిత్రంలో నటిస్తోంది. త్రీడీలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. జితిన్‌లాల్‌ దర్శకుడు. కృతిశెట్టితోపాటు, ఐశ్వర్యరాజేష్‌, సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు.
కత్రినా ఫోన్ భూత్ ట్రైలర్ రిలీజ్
కత్రినా కైఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ ఖట్టర్‌, జాకీష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ 'ఫోన్‌ భూత్‌'. అందాల భామ కత్రినా కైఫ్‌ ఇందులో భూతంగా నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గుర్మీత్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హాన్‌ అఖ్తర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. శాపం కారణంగా భూతంగా మారిన కత్రినా కైఫ్‌.. తనకి మోక్షం కలిగి మామూలుగా మారడానికి ఏం చేసింది? భూతాలంటే అమితాసక్తి చూపించే సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ ఖట్టర్‌లతో తను ఎలాంటి విన్యాసాలు చేయిస్తూ హాస్యం పండించిందో ఇందులో వినోదాత్మకంగా చూపించారు. నవంబరు 4న ఈ చిత్రం విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: