చాలా కాలం తర్వాత సుమన్ హీరోగా రానున్న ....'మహారాజు '....!!

murali krishna
శ్రీవెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం.. విజయదశమిని పురస్కరించుకుని.. హైదరాబాద్ సినీ సర్కార్‌ ఆఫీస్‌లో స్ర్కిప్ట్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
ఈ కార్యక్రమానికి సీని యర్ హీరో సుమ న్ ముఖ్య అతి థిగా హాజరై.. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమాకు పనిచేసే 24 శాఖలకు సంబంధించిన వారంతా ఈ కార్యక్ర మానికి హాజర య్యారు. సుమన్ హీరో గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహరాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు ఈ బ్యాన ర్‌లో ‘అల్లుడు బంగారం’, ‘అంతేనా.. ఇంకేం కావాలి’ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మల యాళ భా షల్లో గ్రాండ్‌గా నిర్మించబో తున్న ట్లుగా దర్శ కని ర్మాత వెంకట నరసిం హ రాజ్ తెలిపారు.
ఈ సందర్భం గా ద ర్శకని ర్మాత వెంకట నరసింహ రాజ్ మాట్లాడు తూ.. ”మా బ్యానర్ ‌లో రాబోతున్న మూ డవ చిత్రం ‘మహరాజు’. సుమన్ గారు హీరో.
విజయదశమిని పురస్కరిం చుకుని స్క్రిప్ట్ పూ జా కార్య క్రమాలు నిర్వహించాం. వైవి ధ్య మైన కథ తో ఈ సినిమాని తెరకెక్కిం చబోతున్నాం. వచ్చే నెలలో రాజ మం డ్రి పరిసర ప్రాంతాలలో రెగ్యు లర్ షూ టింగ్ మొదల వు తుంది. ప్రముఖ నటీ నటుల తో పాటు కొత్త వారు కూడా ఈ సినిమాలో నటించబో తున్నారు. పూర్తి వివ రాలను త్వ రలో నే తెలియ జేస్తాం..” అని తెలిపారు.
సుమన్ హీరో గా తెరకెక్క నున్న ఈ చిత్రానికి
కెమెరా: పిఆర్ చందర్ రావు
సంగీతం: శ్రీ వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: గిరి
కాస్ట్యూమ్ : తిరుపతి
పాటలు: కాసర్ల శ్యామ్
ఎడిటింగ్: నందమూరి హరి
పీఆర్వో: బి. వీరబాబు
సహ నిర్మాత: సి ఈశ్వర్ రెడ్డి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: వెంకట నరసింహ రాజ్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: