సమంత అమలను చిన్నచూపు చూసిందా.. అందుకే నాగార్జున కోపంతో?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రేక్షకులు అందరినీ కూడా తన అందం అభినయంతో మాయ చేసేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు గత దశాబ్ద కాలం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా హవా నడిపిస్తుంది అని చెప్పాలి. ఎంతో మంది కొత్త హీరోయిన్లు వచ్చిన అటు సమంతకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి. ఇకపోతే మొదటి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి చివరికి ప్రేమ వివాహం చేసుకున్న సమంత ఇక ఇటీవల విడాకులతో భర్త నుంచి వేరుపడింది.

 అయితే పెళ్లి చేసుకొని అక్కినేని కోడలుగా మారిన తర్వాత కూడా సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా వరుస సినిమాలతో దూసుకుపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించిన అంశం ఎప్పుడు తెరమీదకి వచ్చిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఎక్కడ కనిపించినా చిలకా గోరింకల్లా ఉండే ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై ఎంతోమంది ఇప్పటికి చర్చించుకుంటూనే ఉన్నారు.

 సమంత నాగచైతన్య సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సమంత ఒకానొక సమయంలో పెళ్లయిన కొత్తలోనే అత్తయ్య అమలను ఏదో విషయంలో దారుణంగా కోపపడిందట. ప్రాణం కంటే ఎక్కువైన తన భార్యను సమంత తిట్టడంపై నాగార్జున కోపం పెంచుకున్నాడట. అక్కినేని ఇంటి కోడలుగా కూడా సమంతకు అర్హత లేదని భావించాడట. ఏకంగా అమలను తిట్టడంతో అక్కినేని కుటుంబం మొత్తం కోపం పెంచుకుంటూ వచ్చింది. ఈ కారణంగానే చైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడు అన్న ఒక వార్త  వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: