వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ట్వీట్...!!

murali krishna
అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ అంటూ వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మిక్స్డ్ రివ్యూలు కూడా వచ్చాయి.


ప్లాప్, యావరేజ్ అని తేల్చారు. కానీ ఇదే సినిమా హిందీ ప్రేక్షకులకు అయితే విపరీతంగా నచ్చేసింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా డబ్బింగ్ సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన ఏకైక తెలుగు హీరోగా బన్నీ నిలిచాడట  


మొత్తానికి పుష్ప మాత్రం బార్డర్లు దాటి క్రేజ్ ను అయితే దక్కించుకుంది. బన్నీ డైలాగ్స్, మ్యానరిజంలు అందరికీ కూడా బాగా ఎక్కేశాయి. చిన్నా పెద్ద, ముసలి ముతకా అని తేడా లేకుండా పుష్ప రాజ్ ఆవహించేశాడు. అయితే ఇప్పుడు బన్నీ మాత్రం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప చిత్రం దుమ్ములేపేసింది. ఊడ్చి అవతల పారేసిందంటూ బన్నీ ట్వీట్ కూడా వేశాడు.


పుష్పచిత్రానికి గానూ ఫిల్మ్ం ఫేర్ అవార్డుల్లో.. ఉత్తమ నటుడిగా బన్నీకి, ఉత్తమ చిత్రంగా పుష్పకు, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌కు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌కు, ఉత్తమ కెమెరామెన్‌గా కుబా, ఉత్తమ గాయకుడు (మేల్) సిధ్ శ్రీరామ్ (శ్రీ వల్లి పాట), ఉత్తమ గాయని కేటగిరీలో ఊ అంటావా పాటకు గానూ ఇంద్రావతికి అవార్డులు కూడా లభించాయి.


పుష్ప మొదటి పార్టుకు వచ్చిన క్రేజ్ చూసి మేకర్లు షాక్ అయ్యారట . దీంతో రెండో పార్టును మరో స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ కూడా చేశారు. దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ కూడా చేంజ్ చేశాడు సుకుమార్. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభించి.. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని మైత్రి మూవీస్ భావిస్తోందని సమాచారం.మరి షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: