వంద కోట్ల క్లబ్ లోకి గాడ్‌ఫాదర్‌.. ఫ్యాన్స్ కు ఖుషి..

Satvika
రీసెంట్ గా చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా గాడ్‌ఫాదర్‌..ప్రస్తుతం ఎక్కడ చూసిన గాడ్ ఫాదర్ హడావిడే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా వచ్చింది.దసరా కానుకగా ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ లో మరో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా లో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించి అలరించారు.


 ఇక ఈ సినిమాలో సత్య దేవ్ , సునీల్ , సముద్రఖని, అనసూయ ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస లతో దూసుకుపోతున్నారు. ఈ తర్వాత.. సైరా నరసింహారెడ్డి, ఆచార్య లు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ తో సాలిడ్ హిట్ కొట్టారు మెగాస్టార్. ఇక గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది. నిజానికి ఒరిజినల్ కంటే ఈ బాగుందని టాక్ వినిపిస్తోంది.


విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు మార్క్ చేరిన గాడ్ ఫాదర్.. ఇప్పుడు 100కోట్ల మార్క్ ను అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు మెగా అభిమానులు.క్లైమాక్స్‏లో చిరు, సల్మాన్ వచ్చే స్క్రీన్ అదిరిపోయిందంటున్నారు. ఇందులో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం కీలకపాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా 'గాడ్ ఫాదర్' ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ నే కాకుండా ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: