బిగ్ బాస్ షో నుంచి ఈ వారం బయటకు వచ్చేది అతడే..!!

murali krishna
ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసిన సెలెబ్రిటీ చలాకి చంటి ఒకరు . సినిమాలు, జబర్దస్త్ ద్వారా చంటికి ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ ఉంది.
. దీనితో బిగ్ బాస్ సీజన్ 6లో ఎంటర్టైన్మెంట్ అందించేది చంటి మాత్రమే అని ఆడియన్స్ చాలా గట్టిగా హోప్స్ పెట్టుకున్నారు.
 
కానీ బుస్సుమంటాడనుకున్న చంటి హౌస్ లో తుస్సుమన్నాడు. తాపీగా సోఫాపై కూర్చుని జోకులు మాత్రం వేసుకుంటూ.. ఇక దేనితో తనకి సంబంధం లేదు అన్నట్లుగా బద్దకంగా మారాడు. ఈ వారం చంటి నామినేషన్స్ లో కూడా ఉన్నాడు. అతడి తీరుతో ఓటింగ్ బాగా దెబ్బ తిన్నట్లు ప్రచారం బాగా జరుగుతోంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే అంటూ  చాలా వార్తలు  కూడా వస్తున్నాయి.
 
ఈవారం నామినేషన్స్ లో ఫైమా, బాలాదిత్య, చంటి, ఇనయ , ఆదిరెడ్డి, మెరీనా , అర్జున్, వాసంతి ఉన్నారు. టాస్క్ లలో పెర్ఫామ్ చేయలేకపోవడంతో చంటి ఓటింగ్ లో బాగా వెనుకబడినట్లు వార్తలు  కూడా వస్తున్నాయి. చంటితో పాటు బాలాదిత్య, మెరీనా కూడానా డెంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
 
లీకైన సమాచారం మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు చంటితో పాటు బాలాదిత్య, మెరీనా ఎలిమినేషన్ వీడియో ఏవీ కూడా రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని.. ఈ ముగ్గురిలో ఎవరు బయటకి వెళ్లినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
 
బాలాదిత్య తొలివారం మంచి మార్కులు కొట్టేశాడు. కానీ అతడి ఆటతీరు తర్వాతి వారాల్లో రాముడు మంచి బాలుడు అన్న చందంగా సాగింది మరి . అతడిలో హుషారు లేకపోవడంతో ప్రేక్షకుల ఓట్లు  కూడా తగ్గాయి. ఇక మెరీనా పరిస్థితి కూడా అంతే. కానీ ఓటింగ్ లో మాత్రం చంటి వీరిద్దరి కంటే బాగా వెనుక బడినట్లు తెలుస్తోంది.
 
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్న వారిలో చంటి కూడా  ఒకరు ఉన్నారు. అతడు గేమ్ పెర్ఫామ్ చేయలేకపోవడంతో నిర్వాహకులు సాగనంపాలని డిసైడ్ అయినట్లు  మనకు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: