సీక్వెల్కుసిద్ధమవుతున్న సూర్య బ్లాక్బస్టర్ మూవీ..?

murali krishna
సూర్య  సినిమాల్లో  'గజిని ' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటివరకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్యకు ఈ చిత్రం స్టార్‌ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది.ఈ  మూవీతోనే  సూర్యకు  తెలుగులో  విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్‌ స్టార్ హీరో రేంజ్‌ కలెక్షన్‌లు సాధించింది.
సూర్య సినిమాల్లో ‘గజిని’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటివరకు హీరోగా  మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న  సూర్యకు ఈ చిత్రం స్టార్‌ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. ఈ మూవీ తోనే సూర్య కు తెలుగులో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్‌ స్టార్  హీరో రేంజ్‌ కలెక్షన్‌లు సాధించింది. ఏ. ఆర్‌  మురుగదాస్‌  దర్శకత్వం  వహించిన ఈ చిత్రం  అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో  సూర్య  నటన వర్ణణాతీతం. సంజయ్  రామస్వామి పాత్రలో నటించాడు  అనడం కంటే  జీవించాడు  అనడం సబబు. మతి మరుపు అనే  కాన్సెప్ట్ ‌తో కమర్షియల్ సినిమా తీసి బ్లాక్‌బాస్టర్  సాధించొచ్చు అని ‘గజిని’తో ఏ.ఆర్ మురుగుదాస్  నిరూపించాడు.కాగా ఇప్పుడు ఈ చిత్రాని కి సీక్వెల్‌  తెరకెక్క నున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే  మురుగదాస్‌  స్క్రిప్ట్‌  పనులు కూడా స్టార్ట్ చేశాడట. వీలైనంత త్వరగా స్క్రిప్ట్‌ను పూర్తి చేసి  సినిమాను  సెట్స్‌ పైకి  తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నాడట. ఇక  ఈ  సీక్వెల్‌  కోసం సూర్య కూడా  ఎగ్జైటింగ్‌  ఎదురు చూస్తున్నాడట. అన్ని కుదరితే  త్వరలోనే ఈ  సీక్వెల్‌ కు   సంబంధించిన అఫీషియల్ ‌   ప్రకటన  రానుంది. అప్పట్లో గజిని చిత్రానికి  దాదాపు రూ.7 కోట్ల వరకు బడ్జెట్‌ అయింది. ఫుల్‌రన్‌  లో రూ.50 కోట్లు  కలెక్ట్‌ చేసి  బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2005 లో  3వ  హై యెస్ట్ గ్రాసర్ ‌గా గజిని నిలిచింది. ఈ  చిత్రాన్ని  తెలుగు లో అల్లు  అరవింద్  రిలీజ్‌ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: