తన భార్యతో విడిపోవడంపై షాకింగ్ కామెంట్ చేసిన రణవీర్..!!

Divya
బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో రణవీర్ సింగ్, దీపికా పడుకొనే ప్రేమించుకోని వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ చూడడానికి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే గడిచిన కొంతకాలంగా వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు వచ్చాయని ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఈ విషయంపై సెన్సార్ బోర్డు మెంబర్.. ఉమైర్ సందు గడిచిన కొద్ది రోజుల క్రితం తన ట్విట్టర్ నుంచి ఈ విషయాన్ని తెలియజేశారు దీంతో ఈ విషయం మరింత బలపడింది.

దీంతో చాలామంది కూడా వీరిద్దరు విడిపోతున్నారు అనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై రణవీర్ సింగ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటీవలే ముంబైలో AICCI ఈవెంట్ కు హాజరైన రణవీర్ తనపై వస్తున్న ఇలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. దీపిక అంటే తనకు చాలా గౌరవం అని, తనని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని తెలియజేశారు. ఇక దీపికా తో సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ తనతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను అని తెలియజేశారు అందుకోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని కూడా తెలిపారు.

వ్యక్తిగతంగా కూడా తన నుంచి చాలానే నేర్చుకున్నానని అంతేకాకుండా మీ అందరికీ ఒక మంచి సర్ప్రైజ్ కూడా త్వరలోనే ఉంటుందని తామిద్దరం కలిసి చూస్తారు అంటూ కూడా ఇలాంటి విషయాలకి చెక్ పెట్టాడు రణవీర్. ప్రస్తుతం రణవీర్ రెండు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.ఇందులో రాఖీ రాణి కి ప్రేమ్ కహాని, సర్కస్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక దీపికా పడుకొనే చేతులో ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నది. ఈమె నటించిన పటాన్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది ఆ తర్వాత ప్రభాస్ తో ప్రాజెక్ట్ -k సినిమాలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: