మళ్లీ ఆసుపత్రి పాలైన దీపిక పడుకొనే.. కారణం..?

Divya
ప్రముఖ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు పొందింది హీరోయిన్ దీపికా పడుకొనే.. అయితే తాజాగా ఆమె అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది. తీవ్ర ఆసౌకర్యం కలగడంతో ముంబైలోని బ్రిచ్ క్యాండీ అనే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అలా చేరిన వెంటనే ఈమెకు అక్కడ పలు పరీక్షలు కూడా నిర్వహించినట్లు వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీపికా ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం దీపికా పడుకొనే హైదరాబాదులో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K సినిమా షూటింగ్ లో నటించింది.

ఆ సమయంలో ఈమె గుండె కాస్త వేగంగా కొట్టుకోవడంతో అక్కడే ఉన్న కామినేని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నది. ఆ సమయంలోనే ఈమెకు తీవ్రమైన పని ఒత్తిడితో తన ఆరోగ్యం దెబ్బతినిందని వైద్యులు సూచించారు. కాగా కొన్ని నెలల క్రితం దీపికా పడుకునే కు కరోనా సోకింది. అయితే కరోనాను అధిగమించిన తర్వాత ఆమె యూరోపియన్ పర్యటనకు వెళ్లడం జరిగిందట. అలా వెళ్లి వచ్చిన వెంటనే ప్రభాస్ సినిమా షూటింగ్లో పాల్గొనింది. ఇలాంటి హార్డ్ వర్క్ వల్ల తన రక్తపోటుపై ప్రభావం చూపించిందని నిర్మాత అశ్వనీదత్ గతంలో ఒకసారి తెలియజేశారు

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఇక దీపిక పడుకొని హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రం కూడా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం కూడా అత్యధిక భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్రగుంద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇక దీపికా పడుకొనే షారుక్ ఖాన్ నటిస్తున్న పటాన్ చిత్రంలో కూడా ఇమే హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రం జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: