కన్ఫ్యూజన్ లో హీరోలు వెలవెల పోతున్నటాలీవుడ్ !

Seetha Sailaja

కరోనా పరిస్థితులు తరువాత టాలీవుడ్ టాప్ హీరోల నుండి మిడిల్ రేంజ్ హీరోల వరకు విపరీతమైన కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు వారు చేస్తున్న సినిమాలను బట్టి అర్థం అవుతుంది. నితిన్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ శర్వానంద్ రామ్ ఇలా వీరికి సంబంధించిన సినిమాలు ఏవీ మరో ఆరు నెలలు వరకు రావు.

నాగచైతన్య నిఖిల్ ల సినిమాలు కూడ మరో ఆరు నెలల వరకు వచ్చే ఆస్కారం లేదు. ఈవారం నాగశౌర్య సినిమా మాత్రం ఉంది. ఇక యంగ్ హీరోలుగా తమకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న అఖిల్ నవీన్ పోలిశెట్టి వైష్ణవ్ తేజ్ సినిమాలు కూడ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక కేవలం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున సినిమాలు మాత్రమే ఈ సంవత్సరంలో వస్తున్నాయి.

ఇక టాప్ యంగ్ హీరోల గురించి పరిశీలిస్తే మహేష్ రామ్ చరణ్ ల సినిమాలు సమ్మర్ కు రాబోతుంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల మూవీలు ఎప్పుడు వస్తాయో తెలియదు. టాప్ యంగ్ హీరోలలో ఒక్క ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై మాత్రమే క్లారిటీ ఉంది. దీనితో టాలీవుడ్ హీరోలకు ప్లానింగ్ తప్పిందా లేకుంటే తమ సినిమా విడుదల చేయాలి అంటే ఎక్కడ ఫెయిల్యూర్ వస్తుందో అని భయపడిపోతున్నారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోలుగా ముద్రపడిన నాని రవితేజా లు సినిమాలు చేస్తున్నారు కాని వారి మార్కెట్ కూడ బాగా దెబ్బతినడంతో వరసపెట్టి వారు చేస్తున్న సినిమాల విడుదల గురించి వెనకడుగు వేస్తున్నారా అన్నసందేహాలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం టాప్ మిడిల్ రేంజ్ హీరోలలో ఎవరి సినిమాలు హిట్ అవుతాయి మరి ఎవరి సినిమాలు ఫ్లాప్ అవుతాయి అన్న విషయమై ఇండస్ట్రీ పెద్దలకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీ భవిష్యత్ లో సినిమా తీయగలుగుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: