అజిత్ మ్యారేజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్...!!

murali krishna
ప్రముఖ దక్షణాది నటుడు అజిత్ కుమార్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇక ఈ హీరోకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..
ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మొదటిసారిగా సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సిఫార్సు చేసిన ప్రేమ పుస్తకం అనే సినిమాలో నటించే అవకాశాన్ని అజిత్ గారు దక్కించుకున్నారు. అయితే అజిత్ నటించిన తొలి ఏకైక చిత్రంగా విచిత్రం మిగిలిపోయింది అని సమాచారం విచిత్రాన్ని హెచ్ వినోద్ కుమార్ రచయిత మరియు దర్శకత్వం వహించారు. అజిత్ నటించిన వాలిమై సినిమా ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది, కానీ ఫ్లాప్ టాక్ నడిచింది.
 
మొదట హీరోయిన్ హీరాను ప్రేమించి ఆ తర్వాత ఆమెను వదిలేసి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు హీరోయిన్ షాలీని ను ప్రేమించి వివాహం చేసుకున్నారు అజిత్.. అయితే వీళ్ళ పెళ్లి పై ఒక సీనియర్ జర్నలిస్ట్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అప్పట్లో అజిత్ ను హీరా చాలా ప్రేమించింది అని దర్శకులు నిర్మాతలు కాళ్లు పట్టుకొని మరి అజిత్ కి సినిమా అవకాశాలు ఇప్పించిందని విషయాన్ని తెలియజేశారు . అయితే ఆమె అంతగా ప్రేమించిన అజిత్ మాత్రం శాలినితో ఒక్క సినిమా చేయగానే ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి మళ్లీ వివాహం చేసుకున్నారని ఆ జర్నలిస్ట్ తెలియజేశారు.
 
అయితే ఇంతగా హీరా అజిత్ ని ప్రేమించినా కూడా అతడు ఎందుకు అలా చేశారో అన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియదని తెలియజేశారు.. అయితే ఒకసారి అలా ఎందుకు చేసావు అని అజిత్ ను అడగగా.. హీరా ఒక డ్రగ్ అడిక్ట్. అలాగే ఆమె చేసే పనులు కూడా చాలా విచిత్రంగా పిచ్చిపిచ్చిగా ఉంటాయి అని  అజిత్ చెప్పారు. ఆమె ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదని అందుచేతనే ఆమె ఎక్కువ రోజులు తనతో సంసారం చేయలేదని ముందుగానే వదిలేసానని అజిత్ చెప్పినట్లుగా సమాచారం. అయితే ఇంతగా ప్రేమించిన అమ్మాయి పై ఇలాంటి నిందలు ఎందుకు వేశారో తెలియదని ఆ జర్నలిస్టు తెలియజేశారు. అయితే అజిత్ చెప్పినవన్నీ మాత్రం అసత్యాలేనని ఆమె అలాంటి పరిస్థితులలో ఏమీ లేదని చాలా బాగుందని కూడా స్పష్టం చేశారు ఈ జర్నలిస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: