గాడ్ ఫాదర్ సినిమాలో పొలిటికల్ ట్రీట్ ఉంటుందా..!!

Divya
ఇక చిరంజీవి గడచిన రోజున నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం తన నుంచి దూరం కాలేదని చిరంజీవి ఒక డైలాగులు విడుదల చేశారు. అయితే ఆ డైలాగ్ షేర్ చేయడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఆ విషయం. గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఈ డైలాగ్ ఉండబోతోంది అని అభిమానుల సైతం భావిస్తున్నారు. అయితే ఈ డైలాగు విన్న అభిమానుల సైతం చిరంజీవి మళ్ళీ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే అంశం నెట్టింట వైరల్ గా మారుతోంది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ప్రత్యేకంగా రాజకీయాలలోకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. పూర్తిగా చిరంజీవి సినిమాలలో బిజీగా మారిపోయారు. అంతే కాకుండా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టిన పార్టీ గురించి చిరంజీవి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు అని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ డైలాగ్ తో మాత్రం ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేసాయని చెప్పవచ్చు. ఈ డైలాగ్ విన్న అభిమానుల సైతం చిరంజీవి మళ్ళీ రాజకీయాలలోకి దిగితే బాగుంటుందని అంతేకాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతు నిలిస్తే ఇంకా బాగుంటుందని భావిస్తున్నారు.

ఇక చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో పొలిటికల్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో చిరంజీవి పొలిటికల్ గా ఎవరికి ఎదురు నిలవబోతున్నారు. అన్న అంశంపై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వాతావరణంలో కూడా చాలా వేడెక్కుతున్న నేపథ్యంలో చిరంజీవి నోట వచ్చే పొలిటికల్ డైలాగులు అన్ని పార్టీలను ఆసక్తికరంగా మార్చేలా ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.ఇక సినిమాలో మాత్రం చిరంజీవి పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చిత్ర బృందం మాత్రం చాలా ధీమాని వ్యక్తం చేస్తున్నారు. నయనతార, సల్మాన్ ఖాన్, నటిస్తున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజు దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: