సీతారామంకి బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ ఫిదా?

Purushottham Vinay
బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు సంపాదించుకున్నారు స్టార్ నటి కంగనా.అయితే ఈమె ఏ విషయం అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడుతూ కుండలు బద్దలు కొట్టినట్టు ప్రశ్నించడం వల్ల బాలీవుడ్ లో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.అవతల ఎంత పెద్ద స్టార్ వున్న ఎలాంటి వారు ఉన్నారన్న విషయాన్ని పక్కన పెట్టి తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె నిత్యం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై పెద్ద ఎత్తున మండిపడుతుంటారు.ఇలా నిత్యం హాట్ హాట్ గా ఉండే ఈమె తాజాగా సీతారామం సినిమా పై చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల అయ్యి సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి విజయం సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయడంతో హిందీలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాని కంగనా రనౌత్ చూశారని ఈమె ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.


ఈ సందర్భంగా కంగనా స్పందిస్తూ చివరికి సీతారామం సినిమా చూసే సమయం దొరికింది. ఈ సినిమా చూస్తూ అనుభూతికి లోనయ్యాను చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ప్రేమ కథ ఇది. దర్శకత్వం స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. డైరెక్టర్ హనురాగవపుడికి తను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రాఫ్ట్ విషయంలో ఎంతో అద్భుతమైన పనితీరు కనబరిచారు అంటూ తెలియజేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్క నటీనటులు ఎంతో అద్భుతంగా చేశారు. ముఖ్యంగా మృణాల్ తన పాత్రలో ఒదిగిపోయి చేశారు. ఈ పాత్రకి ఈమె తప్ప మరెవరు ఇంత అద్భుతంగా చేయలేరని డైరెక్టర్ ముందే ఊహించి ఆమెని ఎంచుకున్నారు. మృణాల్ నిజమైన మహారాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్.. నీ రూలింగ్ మొదలైంది అంటూ ఈ సినిమాపై ఆమె ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నిజానికి మృణాల్ కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి పైకి వచ్చింది. అందుకే కంగనా సపోర్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: