ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్నా కార్తీకేయ... ' బెదురులంక 2012 ' ...!!

murali krishna
ఆర్ ఎక్స్ 100'తో యంగ్ హీరో కార్తీకేయ  టాలీవుడ్ హీరోగా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫొటో' తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి 'బెదురులంక 2012' అనే టైటిల్ ఖరారు చేశారు. నేడు (సెప్టెంబర్ 21) కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను వెల్లడించారు. ఈ పుట్టిన రోజుతో కార్తీకేయన 29వ ఏటా పెట్టారు. దీంతో ఆయన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ కార్తీకేయ 8వ చిత్రాన్ని ప్రకటించారు. చివరిగా తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో 'వలిమై'లో నెగెటివ్ రోల్ లో నటించారు. తాజా చిత్రం'బెదురులంక 2012'లో నటిస్తున్నారు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మొత్తంగా టైటిల్ పోస్టర్ మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
హీరో కార్తికేయకు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను వెల్లడించడం సంతోషంగా ఉందని నిర్మాత బెన్నీ ముప్పానేని తెలిపారు. త్వరలో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తిచేసుకున్నట్టు తెలిపారు. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో షూటింగ్ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుందని, దాంతో సినిమా పూర్తవుతుందని వివరించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారన్నారు. 'స్వర్గీయ' సిరివెన్నెల కూడా ఈ చిత్రంలో ఒక పాట రాయడం విశేషం.
ఇక ఈ చిత్రంలో కార్తీకేయ సరికొత్తగా కనిపిస్తారని దర్శకుడు క్లాక్స్ తెలిపారు. ఊరి నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తుండటం సంతోషంగా ఉందని తెలిపారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణంగా కనిపించనున్నారు. ఈ ఏడాదే చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: