సమంత 'యశోద' మూవీ ఓవర్సీస్ హక్కులకు మేకర్స్ అన్ని కోట్ల ధర కోడింగ్ చేస్తున్నారా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉంటే సమంత ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో కమర్షియల్ సినిమా లలో నటించినప్పటికీ ,  అప్పు డప్పుడు కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత 'యశోద' అని లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. హరి శంకర్  - హరీష్ నారాయణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ,  ఉన్ని ముకుంద‌న్‌ , వరలక్ష్మి శరత్ కుమార్ ,  రావు రమేశ్ ,  మురళీ శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు విదంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం మేకర్స్ దాదాపు 5 కోట్ల వరకు కోడింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: