టాలీవుడ్లో ఏ హీరోకి లేని చెత్త రికార్డ్ బాలయ్య సొంతం?

Purushottham Vinay
సాధారణంగా ఒక సినిమా విడుదల వరకు కూడా ఏ సినిమా కైనా మంచి బజ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా సినిమా రివ్యూల కోసం గూగుల్ లో వెతికితే చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి.అయితే ఇలాంటి రివ్యూలలో నిజాయితీ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రివ్యూలు బట్టి సినిమా హిట్ లేదా ఫ్లాప్ గా డిసైడ్ చేయలేము. మంచి రివ్యూస్ వచ్చిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు వున్నాయి. ఇంకా అలాగే చెత్త రివ్యూలు వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ IMBD మాత్రం అలా కాదు.ఈ వెబ్సైట్ జనాల ఓటింగ్స్ ద్వారా రివ్యూలను తెలుపుతూ ఉంటుంది.


ఈ సైట్లో ఎక్కువ మంది ప్రేక్షకులు నచ్చిన సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇస్తే నచ్చని సినిమాలకు తక్కువ రేటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా IMBD లో తక్కువ రేటింగ్ గల సినిమాలను ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాకు 2.0 రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ సినిమాకు కూడా 2.0 రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక వీరితోపాటు జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ నటించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ను ఇమిటేట్ చేసీ ఆర్జీవి చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం పరాన్న జీవి సినిమాకు కూడా IMBD 2.0 రేటింగ్ను ఇచ్చింది.


ఇక మరొకసారి బాలకృష్ణ నటించిన మహారథీ సినిమాకి కూడా ఇందులో 2.0 రేటింగ్ మాత్రమే లభించింది. ఇక బాలయ్య హీరోగా నటించిన మరొక చిత్రం పరమవీరచక్ర కు కూడా దారుణమైన రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రానికి ఏకంగా 1.8 రేటింగును ఇవ్వడం జరిగింది బాలయ్య కెరీర్ లో వచ్చిన మరొక డిజాస్టర్ చిత్రం ఒక్క మగాడు. ఈ సినిమాకు దారుణమైన రేటింగ్ రావడం జరిగింది. IMBD లో ఈ సినిమాకు 1.8 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అన్నిటికంటే అతి తక్కువ దారుణమైన రేటింగ్ కలిగిన సినిమా మోహన్ బాబు నటించిన రగిలే గుండెలు.. ఈ సినిమా ఐఎండీబీ ప్రకారం 1.3 రేటింగ్ మాత్రమే సంపాదించింది. ఇందులో బాలకృష్ణకు సంబంధించి ఎక్కువ సినిమాలు చాలా దారుణంగా రేటింగ్ను సంపాదించాయి.కాబట్టి బాలయ్యాకు ఇండస్ట్రీలో ఈ చెత్త రికార్డ్ అనేది వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: