ఆ బాబా ను నమ్ముతున్న... ' సమంత '....!!

murali krishna
వేళకాని వేళలో సమంతకు విడాకులయ్యాయి. ప్రస్తుతం ఆమె వయసు 35 సంవత్సరాలు. నాగ చైతన్యతో విడాకులు తీసుకొని కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదు.
మరో పక్క వయసు ముంచుకొస్తుంది. లేటు చేస్తే ఏజ్ బార్ అవుతుంది. వయసు పెరిగాక పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే సందేహాలు మొదలు కావచ్చు. సమంతను రెండో పెళ్లి విషయంలో అనేక ప్రశ్నలు వేధిస్తుండగా ఆమె… ఓ బాబాజీని నమ్మి ముందుకు వెళుతున్నారట. ఆయన సలహా మేరకు పెళ్ళి చేసుకోబోతున్నారట. మరొక ట్విస్ట్ ఏమిటంటే అబ్బాయిని కూడా ఆయనే చూశారట. సమంతకు పెళ్లి సంబంధం చూసిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. సద్గురు బాబా అట.
ఆధ్యాత్మిక వేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉంది. సమంత ఆయన శిష్యురాలు. అనేక సందర్భాల్లో ఆయన్ని సమంత కలిశారు. ఆయన సూక్తులు, ప్రవచనాల పట్ల సమంత ఆకర్షితురాలు అయ్యారు. విడాకుల తర్వాత కూడా ఆ మానసిక వేదన నుండి బయటపడటానికి సమంత సద్గురును ఆశ్రయించారు. ఆ సమయంలో సమంత తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో పాటు అనేక హిందూ పుణ్యక్షేత్రాలు దర్శించారు. సద్గురు సలహాలు ఆమెను వేదన నుండి కాపాడాయి.
ఆ పరిచయంతోనే సమంతకు సద్గురు సంబంధం చూశారట. ఇది వినడానికి కొంచెం నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం అంటున్నారు. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాలి. మరోవైపు సమంత పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యారంటూ గతంలో కథనాలు వచ్చాయి. దారుణంగా ఆమె గర్భాశయం కూడా తొలగించుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజా వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రస్తుతం సమంత చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో సమంత యశోద, శాకుంతలం అనే రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. వీటిలో సమంత ప్రధాన పాత్ర చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే బాలీవుడ్ లో ఆమె ఒకటి రెండు చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం. వీటితో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: