బన్నీని మోస్తున్న శ్రీ విష్ణు....!!

murali krishna
వర్సటైల్ యాక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచున్న నటుడు శ్రీవిష్ణ. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ను అలరిస్తున్నారు శ్రీవిష్ణు.
క్రమం లోనే త్వరలో అల్లూరి గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం తో ప్రదీప్ వర్మ దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు.. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ను ఆకాశానికెత్తేశారు. “నీకు ఇండస్ట్రీలో ఎవరూ లేరని భావించకు. నేనున్నాను. నీకు ఎలాంటి అవసరం వున్న నన్ను అడుగు” అని నాకు బన్నీ దైర్యం చెప్పారని అన్నాడు శ్రీవిష్ణు.
అలాగే .. నేను ఇండస్ట్రీకి ఖాళీ చేతులతో వచ్చా. ఎటు వెళ్ళాలో తెలీదు. అలాంటి సమయం లో ప్రేమ ఇష్క్ కాదల్ లో మా బెక్కం వేణుగోపాల్ గారు చిన్న పాత్ర ఇచ్చారు. ఈ విడుదలైన నాలుగైదు రోజులకు అల్లు అర్జున్ గారి నుండి కాల్ వచ్చింది. మొదట నమ్మలేదు. ఫ్రండ్స్ ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నా అన్నారు. ఆ తర్వాత ఆయన్ని కలవడానికి వెళ్ళా.. ఆ సమయంలో బన్నీ రేసుగుర్రుం షూటింగ్ లో వున్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను. ''నీకు చాలా అవకాశాలు వస్తాయి. కానీ తొందరపడి చేయొద్దు. మరో ఐదేళ్ళలో పరిస్థితి మారుతుంది. కంటెంట్ వున్న లే ప్రేక్షకులు చూస్తారు. నువ్వు కంటెంట్ వున్న లే చేయాలి. నీకు కథ నచ్చితే నా దగ్గరరికి తీసుకురా. నేను నిర్మించే ఏర్పాటు చేస్తాను. నీకు ఇండస్ట్రీ లో ఎవరూ లేరని భావించకు. నేనున్నాను. నీకు ఎలాంటి అవసరం వున్న నన్ను అడుగు” అని మాటిచ్చారు. ఆయన మాటలు నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చాయి. బన్నీ గారితో సన్ అఫ్ సత్యమూర్తి చేశా అన్నారు.
అలాగే ఒకసారి శభరిమల వెళ్తే ఆ తో నన్ను గుర్తుపట్టారు. కరోన తర్వాత సచు అనే ప్రదేశాని కి వెళ్ళా. అక్కడ సరిగ్గా ఆక్సిజన్ కూడా వుండదు. అక్కడ కూడా సన్ అఫ్ సత్యమూర్తి తోనే నన్ను గుర్తు పట్టారు. ఆక్సిజన్ లేని చోట కూడా అల్లు అర్జున్ ఆర్మీ వుంది. అందరూ ప్లాన్ చేసి పాన్ ఇండియా మూవీ చేస్తారు. బన్నీ గారు అవేమీ చేయాల్సిన అవసరం లేదు. ఫిలిం నగర్ లో పాట రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అవ్వుద్ది. నాకు అల్లు అర్జున్ గారు ఎంత ఇష్టమో చెప్పాలంటే.. నా ప్రతి , పాత్ర టైటిల్ లో ఎఎ అనే అక్షరాలూ ఉండేలా చూసుకుంటా. మిస్ అయిన ఒకే ఒక అల్లూరి. అందుకే ఈ ఈవెంట్ కి ఆయన్ని రావాలని కోరాను అంటూ చెప్పుకొచ్చారు శ్రీవిష్ణు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: