మహేష్ స్టామినా ఏంటో చెప్పడానికి ఇది చాలదా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించిన విధంగా ఓపెనింగ్స్ రాబడుతూ ఉంటాయి. మహేష్ బాబుకు సరైన డైరెక్టర్ పడితే చాలు హడావిడి అంతకుమించి ఉండేలా ఉంటుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర హిట్ సక్సెస్ చూసిన శ్రీను వైట్ల మహేష్ బాబు ఇద్దరి కాంబినేషన్లో దూకుడు ఆగడు సినిమాలు వచ్చాయి. దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అయితే ఆగడు సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.మహేష్ బాబు కెరియర్ లోనే ఆగడు సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఆగడు సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆగడు సినిమా ప్రీమియర్స్ తోనే అమెరికాలో ఊహించిన విధంగా ఓపెనింగ్స్ ను రాబట్టింది. అప్పటివరకు ఏ ఇండియన్ సినిమాలకు కూడా ప్రీమియం షో ద్వారా 500 k డాలర్లు అందుకోలేదట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం అప్పటివరకు టాలీవుడ్ లో ఇదే మంచి ఓపెనింగ్ సినిమా అని చెప్పవచ్చు. ముఖ్యంగా నైజాం ఏరియాలో మొదటి రోజు రికార్డు బ్రేక్ సినిమా కూడా ఇదే అని సమాచారం. ఇక మహేష్ బాబు అభిమానులు గతంలో ఎన్నడు లేని విధంగా వంద అడుగుల కటౌట్ ను కూడా నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచారు.

అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేకపోవడం వల్ల అంతంత మాత్రం కలెక్షన్లు రాబట్టాయి. ఈ సినిమాలోని కామెడీ డైలాగులతో మహేష్ బాబు మెప్పించారు. ఇక సెకండాఫ్ లో కాస్త బోరింగ్ అనిపించడంతో ఈ సినిమా రిజల్ట్ మారిపోయింది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 18 కోట్ల రూపాయలను కలెక్షన్ చేసి ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా అటు యూఎస్, నైజాం ఏరియా సౌత్ లో ఇలా అన్నిటిలో కూడా అత్యధిక కలెక్షన్లను మొదటి రోజు రాబట్టి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: