'తిరు' మూవీ అఫీషియల్ 'ఓటిటి' విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ ఉన్నటు వంటి హీరో లలో ఒకరు అయిన ధనుష్ తాజాగా తమిళ్ లో తిరుచిట్రంపళం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో తిరు అనే టైటిల్ తో విడుదల చేశారు. నిత్యా మీనన్, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ ఈ మూవీ లో ధనుష్ సరసన హీరోయిన్ లుగా నటించగా ,  అలాగే దిగ్గజ దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు ఈ మూవీ లో కీలక పాత్రల్లో కనిపించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రతిష్ఠత్మకంగా నిర్మించిన ఈ మూవీ కి మిత్రన్‌ ఆర్‌.జవహర్‌ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ ఈ మూవీ కి స్వరాలు అందించగా ,  ఓం ప్రకాష్‌ ఈ మూవీ కి ఛాయాగ్రహణం అందించారు. ఆగస్టు 18 వ తేదీన విడుదలైన ఈ మూవీ డీసెంట్‌ హిట్‌ గా నిలిచింది.
 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన తిరు మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ , మలయాళ  భాషల్లో సెప్టెంబర్ 23 వ తేదీ నుండి సన్ నెక్స్ట్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్  చేయనున్నట్లు సన్ నెక్స్ట్ 'ఓ టి టి' సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్  ని కూడా విడుదల చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద  ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: