అమల సినిమాలలో నటించకపోవడానికి కారణం ఇదేనా..?

Divya
హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయి ప్రతి కొద్ది సమయంలోనే నాగార్జునాను వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో చాలా బిజీగా మారిపోయింది హీరోయిన్ అమల. అయితే ఈమె సినిమాలకు దూరమై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో మాత్రమే కొన్ని ప్రత్యేకమైన పాత్రలో ఆమె నటించేందుకు ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఇవన్నీ ఆమెకు నిరాశ మిగిల్చాయి కానీ.. తాజాగా ఒకే ఒక్క జీవితం సినిమాలో ఈమెకు మాత్రం మంచి పాత్ర పడిందని చెప్పవచ్చు.ఇక దీంతో అక్కినేని అభిమానులు అమల కూడా సినిమాలలో నటిస్తుందని అందరూ అనుకుంటున్నారు.

కానీ ఆమె నటనపై ఆసక్తి చూపుతున్నట్లుగా కనిపించడం లేదు. ఆమెకు ఉన్న బాధ్యతలు కారణంగా ఆమె సినిమాలలో నటించడం సాధ్యం కాదని తెలియజేసినట్లు సమాచారం. ఒకే ఒక జీవితం సినిమా ప్రెస్మీట్లో భాగంగా అమల ఇలా మాట్లాడుతూ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన తర్వాత ఇతర భాషలలో సైతం పలు వెబ్ సిరీస్లలో నటించాను కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక జీవితం అనే సినిమాలోనే నటించానని తెలిపింది. అన్నపూర్ణ ఫిలిం అండ్ మీడియాలో ఉన్న ఎంతోమంది విద్యార్థులు యొక్క భవిష్యత్తు తనపై ఆధారపడి ఉందని అందుకే నేను సినిమాలతో బిజీగా ఉండకూడదని కోరుకుంటున్నాను అని తెలిపింది.

తన సమయం ఎక్కువగా ఆ విద్యార్థుల కోసమే కేటాయిస్తున్నానని తెలిపింది. నేను వరుసగా సినిమాలు చేయడం వల్ల ఆ బాధ్యతను పూర్తి న్యాయం చేయలేనేమో అనుకుంటున్నాను అందుచేతనే సినిమా ఆఫర్లు వస్తున్నా కూడా తిరస్కరిస్తున్నానని తెలియజేసింది. అయితే ఒకే ఒక జీవితం సినిమా కథ మాత్రం తనకు చాలా నచ్చడంతో ఓకే చెప్పానని తెలిపింది అమల. అందుచేతనే నటించేందుకు ఒప్పుకున్నానని అమల తెలియజేసింది నాగార్జునతో మళ్లీ మీరు నటిస్తారా అని అడగగా నాగార్జున నేను కూడా ఇంట్లో కలిసే ఉంటున్నాము కనుక ఇద్దరం కలిసి నటించే ఉద్దేశం అయితే లేదని తేల్చి చెప్పింది. అయితే భవిష్యత్తులో కథ నచ్చితే అప్పుడు చూస్తానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: