' మంచు లక్ష్మి ' గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు...!!

murali krishna
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్న ప్రపంచంలో బ్రతుకుతున్నాము అంటూ ఎంతోమంది వాపోయారు.
ఇక అలాంటి వారిలో ఇప్పుడు అలనాటి అందాల తార స్టార్ హీరోయిన్ మాధవి కూడా ఇలాంటి ఇబ్బందులని ఎదుర్కొన్నది. ఇక 1990 లలో ఎంతోమంది యువతకు ఆరాధ్య దేవతగా నిలిచిన మాధవి బికినీ ఫోటో షూట్లతో అప్పట్లోనే కుర్ర కారుమతి పోగొట్టింది.. వాస్తవానికి ఈమె గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని భావించింది. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమలో కన్నా కూడా బాలీవుడ్ లోనే మంచి అవకాశాలను అందుకుంది.
ఒకవేళ ఆమె బాలీవుడ్ లో కనుక రానించి ఉంటే ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండి ఉండేది అని చెప్పవచ్చు. బాలీవుడ్ లో ఈమెకు అనుకున్నంత క్రేజ్ లభించలేదు . కానీ టాలీవుడ్ లో మాత్రమే తారస్థాయికి చేరుకుంది. ఇక ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈమెకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇక మాధవి అలా కనుమరుగవడానికి వెనుక ఒక హీరో హస్తం ఉందనే వార్తలు లేటుగా వైరల్ అయ్యాయి.. గత కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లాపులతో సతమతమౌతూ ఇటీవల ఒక హిట్టు కొట్టి అప్పులన్నీ తీర్చుకున్న స్టార్ హీరో సినిమాలలో అప్పట్లో మాధవి బాగా నటించి బిజీ హీరోయిన్ అయింది.
ఆ హీరో మత్తులోనే మాధవి ఎప్పుడూ ఉండేదట. అంతేకాదు ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా టాలీవుడ్ లేదంటే తమిళ్ సినిమాల చుట్టూ తిరిగేలా చేసుకున్నాడట ఆ హీరో. బాలీవుడ్లో అవకాశాలను కోల్పోయి కేవలం సౌత్ సినీ పరిశ్రమకే అంకితం అయింది. ఇక మాధవితో మలయాళ సినిమా పరిశ్రమలో ఒక బూతు సినిమా కూడా ప్లాన్ చేసి మొదలుపెట్టిన తర్వాత .. కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక అవకాశాలు తగ్గుతున్న క్రమంలో పూర్తిగా విరామం ప్రకటించి బ్రిటిష్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని ఫారెన్ లోనే సెటిల్ అయింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లల తల్లిగా ఉన్న మాధవి.. ఒకవైపు బిజినెస్ మరొకవైపు కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: