'షాకిని డాకిని' మూవీ 'ఓటిటి' హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
రెజీనా కాసండ్ర ,  నివేదా థామస్ ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచు కున్నారు . ఇలా ఇప్పటికే ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ఇద్దరు ముద్దు గుమ్మ లు కలిసి తాజాగా షాకిని డాకిని అనే మూవీ లో ప్రధాన పాత్రలలో నటించారు . ఈ మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించ గా ,  డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్ లు ఈ మూవీ ని నిర్మించారు .

ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 16 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ వంతంగా ప్రదర్శిం చబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ 'ఓ టి టి' హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి నేట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు కొన్ని వారాల ధియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీ ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. మైకీ మెక్‌క్లియరీ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , రిచర్డ్ ప్రసాద్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: