ఆది సాయికుమార్ 'తీస్ మార్ ఖాన్' మూవీ 'ఓటిటి'ఫ్లాట్ ఫామ్ లోకి రాబోతుంది..?

Pulgam Srinivas
ఆది సాయికుమార్ తాజాగా తీస్ మార్ ఖాన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ లో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటించింది. సునీల్, పూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ తదితరులు ఈ మూవీ లో  ముఖ్య పాత్రలలో నటించారు. కళ్యాణ్ జి గోగణ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , నాగం తిరుపతి రెడ్డి ఈ మూవీ ని నిర్మించాడు. సాయి కార్తీక్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , బాల్ రెడ్డి ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు. ఈ మూవీ 19 ఆగస్టు 2022వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది  పర్వాలేదు అని రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన తీస్ మార్ ఖాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా చివరకు బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీ గా మిగిలి పోయింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో వెలవడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి థియేటర్ లలో ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేకపోయినా తీస్ మార్ ఖాన్ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: