నేనే వస్తున్నా టీజర్: హీరో, విలన్ గా దుమ్ములేపిన ధనుష్?

Purushottham Vinay
టాలీవుడ్ లో మంచి మార్కెట్ వున్న కోలీవుడ్ హీరోలలో ధనుష్ ఒకరు. తాను నటించే ప్రతీ సినిమాని కూడా తెలుగులోనూ డబ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నారు.ఇక ఈ క్రమంలో 'సార్' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా చేస్తున్నాడు. అయితే అంతకంటే ముందుగా ఇప్పుడు ''నేనే వస్తున్నా'' అంటూ డబ్బింగ్ తో వస్తున్నాడు ధనుష్.ధనుష్ హీరోగా తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నానే వరువేన్'. తెలుగులో ఈ చిత్రాన్ని ''నేనే వస్తున్నా'' అనే పేరుతో విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.'నేనే వస్తున్నా' సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు హీరోగా కనిపిస్తే.. మరొకరు విలన్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఒకరు తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే.. ఇంకో పాత్ర అడవుల్లో తిరుగుతూ మర్డర్స్ చేస్తున్నాడు. అయితే వీరిద్దరికీ ఏదో కనెక్షన్ ఉన్నట్లు ఇద్దరి మధ్య వైరం ఏర్పడినట్లు టీజర్ ని బట్టి తెలుస్తోంది.


ధనుష్ రెండు పాత్రల గెటప్స్ ఇంకా యాక్టింగ్ లో వైవిధ్యం చూపించాడు. ఇందులో సెల్వరాఘవన్ కూడా కీలక పాత్రలో నటించారు. అతని గెటప్ డిఫరెంట్ గా ఉంది. ఇద్దరు ధనుష్ లకు జోడీగా ఇందూజ రవిచంద్రన్ - గ్రీకు నటి షెల్లీ కిషోర్ కనిపించారు. యోగి బాబు, ప్రభు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.టీజర్ లో కథేంటినేది రివీల్ చేయకుండా ఎలాంటి డైలాగ్స్ లేకుండా చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. యువన్ శంకర్ రాజా సమకూర్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అలాగే ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. భువన్ శ్రీనివాసన్ దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు.'నేనే వస్తున్నా' సినిమాకి ధనుష్ ఇంకా సెల్వ రాఘవన్ ఇద్దరూ కూడా కలిసి కథ అందించారు. దాదాపుగా పదకొండేళ్ల విరామం తరువాత అన్నదమ్ముల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగానే లేటెస్టుగా విడుదల చేసిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: