కమెడియన్ కెవ్వు కార్తిక్ కి.. వార్నింగ్ ఇచ్చిన జడ్జి ఇంద్రజ?

praveen
ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.  ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఇంద్రజ స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది అని చెప్పాలి. స్టార్ హీరోలందరితో కలిసి నటించి సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది ఇంద్రజ. ఇక తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ భాషల్లో కూడా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. అదే సమయంలో బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ లో జడ్జి గా కనిపిస్తోంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇలా జబర్దస్త్ లో జడ్జిగా ప్రత్యక్షమవడం కారణంగా అటు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయింది అని చెప్పాలి. ఎప్పుడూ తన దైన జడ్జిమెంట్ తో.. కల్మషం లేని నవ్వు తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పుడు ఎంతో కూల్గా ఉంటూ తన పై వేసే పంచ్ లను స్వీకరించడమే కాదు వేరొకరి పై పంచులు  కూడా వేస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే జబర్దస్త్ జడ్జ్ గా వచ్చిన ఇంద్రజ  కమెడియన్ కెవ్వు కార్తిక్ కు వార్నింగ్ ఇచ్చింది.

 జడ్జిలపై ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యింది. ఏం జరిగిందంటే ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ క్రమంలో భాగంగా కెవ్వు కార్తిక్ టీం అటు జడ్జిల పై పంచులు వేస్తూ ఒక స్కిట్ చేశారు. అయితే ఈ దీంతో ఇంద్రజ అప్సెట్ అయింది అని తెలుస్తుంది. జడ్జిల మీద పంచులు వేయడం కామన్ గా మారిపోయింది. రోజు రోజుకు మరింత దారుణంగా మారిపోతున్నారు. కంటెస్టెంట్స్ ఎంత కష్టపడతారో స్కిట్ చేశారు కదా. అలాగే జడ్జీలు ఎంత కష్ట పడతారో స్కిట్ చేసి చూపిస్తే.. అప్పుడు ఈ జడ్జిమెంట్ చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇంద్రజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: