ఇంద్రజకు అవకాశాలు రాకపోవడానికి.. అతనే కారణమా?

praveen
తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇంద్రజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీరోయిన్గా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఇంద్రజ. తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది అని చెప్పాలి. 1978లో తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఈమె.. కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందినది. చిన్నప్పటి నుంచే నాటకాలు వివిధ పోటీలలో ఎంతో చురుకుగా ఉన్న ఇంద్రజ  ఎన్నో బహుమతులు సొంతం చేసుకుంది అనే చెప్పాలి.

 అయితే మనందరికీ తెలిసిన హీరోయిన్ ఇంద్రజ పేరు రజతి. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2005లో మహమ్మద్ అబ్బర్ అనే ముస్లిం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది ఈ సీనియర్ హీరోయిన్. అతను ప్రముఖ వ్యాపారవేత్త కావడం గమనార్హం. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన జంతర్ మంతర్ అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది ఇంద్రజ. ఇక మొదటి సినిమానే బాక్సాఫీస్ వద్ద  సూపర్హిట్ కావడంతో ఇంద్రజ కు ఒక్కసారిగా పాపులారిటీ వచ్చేసింది. రెండు సంవత్సరాలలోనే 30 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఇంద్రజ.

 కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా దాదాపు స్టార్ హీరోలందరితో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇంద్రజ స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది అని ఆమె కెరీర్ కు తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇంద్రజ కు  అవకాశాలు తగ్గాయి.  ఇందుకు కారణం ఇంద్రజ పనిలో పెట్టుకున్న మేనేజర్ అన్నది తెలుస్తుంది. ఇంద్రజ పాపులారిటీ దృశ్య ఎక్కువ అవకాశాలు రాగా.. దర్శకనిర్మాతలకు ఎక్కువగా డీటెయిల్స్  ఇవ్వకపోవడం.. డేట్లు అడ్జస్ట్ చేయలేకపోవడంతో గడప వరకు  అవకాశాలు మళ్లీ రిటర్న్ వెళ్లిపోయాయట. తర్వాత విషయం తెలుసుకుని మేనేజర్ను  తీసేసి అవకాశాల కోసం  ప్రయత్నిస్తే అప్పటికే నిర్మాతలు ఈమెను పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు బుల్లి తెర పై జడ్జి గా అవతారమెత్తి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రేక్షకులకు దగ్గరైంది ఇంద్రజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: