కమల్ హాసన్ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన క్వీన్ ఎలిజిబెత్..!!

Divya
ఇక ఈరోజు ఉదయం ఇంగ్లాండ్ మహారాణి క్వీన్ ఎలిజిబెత్-2 మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. తన జీవితంలో మూడుసార్లు ఇండియాని సందర్శించడం జరిగింది. 1961, 1983, 1997 సంవత్సరాలలో ఇండియాకి రావడం జరిగింది. 1997 లో క్వీన్ ఎలిజిబెత్ భారత్ కు వచ్చినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరగడం జరిగింది. అదేమిటంటే హీరో కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన" మరుదనాయగం "సినిమా షూటింగ్ 1997 వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన బ్యానర్ పైనే నిర్మించారు. ఇక అంతే కాకుండా డైరెక్టర్ గా కూడా తనే దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించాలనుకున్నారు కమలహాసన్. ఈ చిత్రాన్ని ఒక నవల ఆధారంగా రచయిత సుజాతతో కలిసి ఆరు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా కథను సిద్ధం చేశారు. ఇక 1997 అక్టోబర్లో ఎంజీఆర్ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ ఎంతో గ్రాండ్ గా మొదలైంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విశేషమేమిటంటే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా క్వీన్ ఎలిజిబెత్-2 రావడం జరిగింది అప్పుడు ఆమె దాదాపుగా అక్కడ 20 నిమిషాల పాటు ఉన్నదట.

ఇక అక్కడికి వచ్చిన క్వీన్ ఎలిజిబెత్ కు ట్రీట్ ఇవ్వడానికి చిత్ర బృందం ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని సూట్ చేసి టీజర్ లాగా ప్రదర్శించడం జరిగిందట. దీనికోసం రూ.1.5 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధినేత కరుణానిధి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ చిత్రాన్ని కమల్ హాసన్ రూ.80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్నారు. ఇక ఇందులో విష్ణువర్ధన్, అమ్రిష్ పూరి, నసీరుద్దీన్ తదితరులు కీలకమైన పాత్రలో తీసుకురావాలనుకున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని మాత్రం ఇళయరాజనం ఎంచుకున్నారు. ఇక క్వీన్ ఎలిజిబెత్ మహారాణి ఈ సినిమాని అత్యంత భారీ ఎత్తున లాంచ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా కొన్ని కారణాల చేత ఆగిపోయింది అయితే కమలహాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా తెరకెక్కించాలని కలగా పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: