ట్రైలర్: మాస్ యాక్షన్ తో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం..!!

Divya
వరుస హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల సమ్మతమే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇప్పుడు తాజగా మరొకసారి ఆడియన్స్ ను అలరించేందుకు ఒక మాస్ పాత్రలో నటించారు. ఆ చిత్రమే నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీధర్ గాదే తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోను ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ విడుదల చేయడం జరిగింది.

మొదటిసారి ఊర మాస్ లుక్ లో కిరణ్ అబ్బవరం అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. నీ కూతురు ప్రేమించిన వాడిని కదా నన్ను సైలెంట్ అనుకుంటున్నావేమో.. అనే డైలాగుతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ చిత్రంలో కిరణ్ ఆబ్బవరం చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.  ఇక ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పే డైలాగులు కూడా బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో కిరణబ్బవరం క్యాబ్ డ్రైవర్ గా ఒక్క మాస్ హీరోగా కనిపించబోతున్నారు.

ఇందులో హీరోయిన్ ఒక తాగుబోతు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా చూపించడం జరిగింది. ట్రైలర్ను బట్టి చూస్తే ఈ చిత్రం ఫ్యామిలీ కామెడీ మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇక కిరణ్ అబ్బవరం కూడా ఎప్పటిలాగానే మంచి రేంజ్ తో నటించారని చెప్పవచ్చు . ఇక బాబా భాస్కర్ , గెటప్ శ్రీను ,సమీర్ తదితరులు ముఖ్యమైన పాత్రలో నటించారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య విచిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. మరిచిత్రం కిరణ్ అబ్బవరం కెరియర్ ని మారుస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: