టోవినో థామస్ 'తల్లుమాల' మూవీ అఫీషియల్ 'ఓటిటి' విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
మలయాళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి టొవినో థామస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను మలయాళ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ హీరో నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి . అందులో భాగంగా ఈ హీరో నటించిన అనేక సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించాయి . దానితో టోవినో థామస్ కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది . ఇది ఇలా ఉంటే తాజాగా టోవినో థామస్ తల్లుమాల (చైన్ ఆఫ్ ఫైట్స్)  అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు .
 

బ్లాక్ కామెడీ యాక్షన్ చిత్రంగా వచ్చిన తల్లుమాల  మూవీ లో కళ్యాణి ప్రియదర్శనీ హీరోయిన్ గా నటించింది. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కి విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఈ మూవీ లో  షైన్ టామ్ చాకో కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. తల్లుమాల (చైన్ ఆఫ్ ఫైట్స్) మూవీ ఈ సంవత్సరం ఆగస్టు 12 వ తేదీన మంచి అంచనాలను థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నేట్ ఫ్లిక్స్ ఈ మూవీ 11 సెప్టెంబర్ 2022 తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: