ఈ వారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ వారం థియేటర్ లలో విడుదలకు రెడీ గా ఉన్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ వారం ఆర్య హీరోగా శక్తి ఎస్ రాజన్  దర్శకత్వం లో తెరకెక్కిన కెప్టెన్ మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 8 వ తేదీన విడుదల కాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతోంది.

ఈ మూవీ కి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా , ప్రియదర్శి ,  వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన బ్రహ్మాస్త్రం సినిమా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ మూవీ లో అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ 2 D మరియు 3 D వర్షన్ లలో  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: