పోలీస్ కేసు వల్ల.. భానుచందర్ సుమన్ మాట్లాడుకోలేదట తెలుసా?

praveen
చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది హీరోలు మంచి స్నేహితులుగా ఉన్నవారు ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో ఒకప్పుడు హీరోలుగా ఎంతగానో రాణించిన సుమన్ భానుచందర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక వీరి స్నేహబంధం లో ఒకానొక సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగిందట.  సినిమా షూటింగ్ కాస్త గ్యాప్  దొరకడంతో భోజనం చేయడానికి వెళ్లారట ఇద్దరు హీరోలు.  అక్కడ టేబుల్ పై భోజనం చేస్తున్న సుమన్ ను  కళ్లార్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడట  భానుచందర్. ఏమైంది అలా చూస్తున్నావ్ అంటూ అడిగాడట సుమన్.

 నువ్వు చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నావ్. తెలుగు సినిమాలలో నటించవచ్చు కదా అని సుమన్ భానుచందర్ ను  ఆతృతగా అడిగాడట.  నాకు తెలుగులో ఓనమాలు కూడా రావు అలాంటిది నేను తెలుగు సినిమాలు ఎలా నటించగలడు  అన్నాడట సుమన్.  అప్పుడు మూడు నెలల్లోనే తెలుగు బాగా చక్కగా మాట్లాడుతావు.  మాకు తెలుగు నేర్పించే  స్థాయికి  ఎదుగుతావ్  అంటూ కామెంట్ చేశారు భానుచందర్.  ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్ ను కలసి  సుమన్ ను  తెలుగులో పరిచయం చేయాలని బాను చందర్ కోరాడట. అతను  అడిగాడు లేదో సుమన్ తో సినిమా చేసేందుకు తమ్మారెడ్డి భరద్వాజ ఒప్పుకున్నారు.

 తమ్మారెడ్డి భరద్వాజ రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఇద్దరు కిలాడీలు సినిమా విడుదలైంది. ఆ తర్వాత కోడి రామకృష్ణ తరంగిణి సినిమా విడుదలై దాదాపు 300 రోజులు ఆడింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.  ఒకానొక సమయంలో భానుచందర్ ను తనతో మాట్లాడవద్దని  సుమన్ చెప్పాడట.  ఏం జరిగిందని అడిగితే నన్ను  కేసులో ముద్దాయిగా చేర్చారు.. నాతో క్లోజ్ గా ఉంటే నిన్ను కూడా అందులో చేర్చే  అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని రోజులు నాతో కలవకు  అని సుమన్ చెప్పాడట. ఇక అప్పుడే స్నేహితుడు అంటే సుఖల్లోనే కాదు కష్టాలలో  కూడా ఆలోచించాలని  నా గురించి అలాగే సుమన్ ఆలోచించాడని   భానుచందర్ చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: