బింబిసార 2పై అంతర్మధనం !

Seetha Sailaja

కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా హీరోగా పూర్తిగా సెటిల్ కాలేదు. అలాంటి పరిస్థితులలో ‘బింబిసార’ కళ్యాణ్ రామ్ కు ఇచ్చిన జోష్ అంతాఇంతా కాదు. వాస్తవానికి ఈ సినిమాకు పోటీగా ‘సీతారామం’ విడుదల కాకుండా ఉండి ఉంటే. ఈ సంవత్సరం బ్లాక్ బష్టర్ హిట్స్ లిస్టులోకి ‘బింబిసార’ చేరిపోయి ఉండేది.

అయినప్పటికీ ఈ మూవీ బయ్యర్లకు రెట్టింపు లాభాలు వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ మూవీ విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్ లో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ తో పాటు ఈ మూవీ దర్శకులు వశిష్ట కూడ చెపుతూ వచ్చాడు. అయితే ఈ సీక్వెల్ నిర్మాణానికి మరికొంత సమయం పట్టే అవకాశం కూడ ఉంది అంటున్నారు.

దీనికి కారణం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో ఆమూవీ పై కళ్యాణ్ రామ్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈమూవీ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పరిస్థితులలో ఒకవైపు ఈ మూవీ పై భారీ పెట్టుబడులు పెడుతూ మరొకవైపు ‘బింబిసార 2’ ప్రాజెక్ట్ ను కూడ తలకెత్తుకుంటే సమస్యలు ఏర్పడతాయని కళ్యాణ్ రామ్ ఆలోచన అని అంటున్నారు. దీనితో ‘బింబిసార’ 2 ప్రారంభానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది అంటున్నారు.

దీనికితోడు ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉండటంతో కథ విషయంలో ఏమాత్రం ఖంగారు పడినా అంచనాలు అందుకోవడం కష్టం కాబట్టి ఆచీతూచీ వ్యవహరించాలని కళ్యాణ్ రామ్ ఆలోచన ఆని అంటున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ దిల్ రాజ్ మైత్రీ మూవీస్ అభిషేక్ నామా లకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ లలో పనిచేస్తున్నాడు. ఈమూడు సినిమాలు పూర్తి చేసి ఆతరువాత ‘బింబిసార 2’ గురించి ఆలోచనలు చేస్తే అన్నివిధాల బాగుంటుందని అతడికి తారక్ కూడ సలహాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: