ఆ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్న శర్వానంద్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినా శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా నటించి మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్థానం , రన్ రాజా రన్ , ఎక్స్ ప్రెస్ రాజా , శతమానం భవతి వంటి మంచి విజయవంతమైన మూవీ లతో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ గత కొంత కాలంగా మాత్రం వరస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా శర్వానంద్ , అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సిద్ధార్థ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించగా , రీతు వర్మ ఈ మూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది.

వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది. మరి ఈ మూవీ తో అయినా శర్వానంద్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: