పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. గుడ్ న్యూస్.. వీరమల్లు అప్డేట్..!!

Divya
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ రోజు అని చెప్పవచ్చు. దీనికోసం ఇప్పటికే పెద్ద ఎత్తున పలు ఏర్పాట్లు కూడా చేశారు. ఈసారి జనసేన అధినేత బర్త్డే సంబరాలను చాలా ఘనంగా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు చిత్ర బంధం నుంచి పలు ఆసక్తికరమైన అప్డేట్ తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ చిత్రం 17వ శతాబ్దం కాలం నాటి కథ కావడం గమనార్హం.

కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రాత్మక కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తున్నది. ఇందులో రాబిట్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి పవర్ గ్లాస్ పేరుతో ఒక ప్రత్యేకమైన పద్దతిలో గ్రాండ్ గా వీడియోని విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ రెండవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ఈ అప్డేట్ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఇది ఈరోజు వినాయక చవితి సందర్భంగా వీరమల్లు టీం ఆసక్తికరమైన ఒక పోస్టర్ను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోని అత్యధిక బడ్జెట్ తో వచ్చిన చిత్రంగా పేరు పొందుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాని తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నది. ఇక అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ , నర్గీస్ ఫక్రి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సాయి బుర్ర మాధవన్ డైలాగులు అందిస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: