హరిహర వీరమల్లు మూవీ నుండి ఆ తేదీన అదిరిపోయే టీజర్ రాబోతుంది..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  నిధి అగర్వాల్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతున్న కొన్ని అని వార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త డిలే అవుతూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హరిహర వీరమల్లు మూవీ నుండి ఒక అదిరి పోయే 40 సెకండ్ ల నిడివి కలిగిన యాక్షన్ టీజర్ ని మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. హరిహర వీరమల్లు మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కెరియర్ లో హరి హర వీరమల్లు మూవీ నే మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని మూవీ యూనిట్ కూడా అత్యంత గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉండగా ,  సాయి మాధవ్ బుర్ర ఈ మూవీ కి డైలాగ్ లను అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: