సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ పిక్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయిన సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సుధీర్ సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు మరో కొత్త మూవీ ని ప్రారంభించాడు. అలాగే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను కూడా చిత్త బృందం అధికారికంగా ప్రకటించింది. సుధీర్ బాబు కొత్త మూవీ కి చిత్ర బృందం హంట్ (గన్స్ డోంట్ లై) అనే టైటిల్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది.
 

మోషన్ పోస్టర్‌ లో ఫేమస్ ప్లేసెస్ అయిన బిగ్ బెన్ మరియు ఈఫిల్ టవర్‌ లను చూపించారు. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని కీలక వివరాలు తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ కి మహేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , భవ్య క్రియేషన్స్ పతాకం పై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ లో భరత్ నివాస్, శ్రీకాంత్ తది తరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో , ఈ మూవీ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: