రమ్యకృష్ణ అక్కడ నటించడానికి ఎందుకు భయపడింది..!!

Divya
వెటరన్ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన ఎన్నో భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. మూడు దశాబ్దాల పాటు హీరోయిన్ గా కోనసాగించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలుపెట్టి తన వైవిధ్యమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది రమ్యకృష్ణ. పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో పోషిస్తూ దూసుకుపోతోంది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ దక్షిణాది బాషలలో రాణించినంతగా బాలీవుడ్లో రాణించలేకపోయింది. అందుకు కారణాన్ని కూడా తెలియజేసింది వాటి గురించి చూద్దాం

బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అంతగా ఫేమస్ కాలేకపోయింది రమ్యకృష్ణ. దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత మళ్లీ లైగర్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ వద్ద హిందీ సినిమాల ప్రస్తావన తీసుకురాగా.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఏ ఇండస్ట్రీలో నైనా ఎక్కువ సినిమాలు చేయాలంటే బలమైన విజయాలు రావాలి బాలీవుడ్ లో ఇంతవరకు తనకు చెప్పుకోదగ్గ విజయాలు అసలు రాలేదని అందుచేతనే హిందీ సినిమా అవకాశాలు వచ్చిన అవి వదులుకొని తెలుగులో నటించి స్టార్ హీరోయిన్గా కొనసాగానని తెలియజేసింది. అందుచేతనే తెలుగు ఇండస్ట్రీ ని వదిలి బాలీవుడ్లో సినిమాల పోరాటం చేయలేనని తెలియజేసింది.
రమ్యకృష్ణ 1988లో బాలీవుడ్లో వినోద్ ఖన్నా హీరోగా నటించిన.. దయావాన్  చిత్రంలో ఐటెం సాంగ్ తో మొదట ఎంటర్ ఇచ్చింది ఆ తర్వాత నటిగా కూడా ఖల్ నాయక్, బెనారస్, పరంపరం, క్రిమినల్ తదితర సినిమాలలో నటించింది. అయినా కూడా ఈ సినిమాలు తనకి ఏ విజయాన్ని అందించలేదు. ఇక అంతే కాకుండా తాజాగా విడుదలైన లైగర్ సినిమా కూడా  ఈమెకు బాలీవుడ్ లో పేరు తీసుకురాలేకపోయాయి అందుచేతనే ఇమే బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే నటించడానికి ఎక్కువ మక్కువ చూపుతుందట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: