100 కోట్ల సెలబ్రేషన్లను అక్కడ నిర్వహించనున్న 'కార్తికేయ 2' మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో కెరీర్ ని మొదలు పెట్టిన ఈ యువ హీరో మొదటి మూవీ తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను దక్కించు కున్నాడు. హ్యాపీ డేస్ మూవీ తర్వాత కొంత కాలం పాటు అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఈ హీరో స్వామి రారా , కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఆగస్ట్ 13 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి. దీనితో కార్తికేయ 2 మూవీ యూనిట్ 100 కోట్ల సెలబ్రేషన్స్ ను నిర్వహించనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. కార్తికేయ 2 మూవీ 100 కోట్ల సెలబ్రేషన్ లను ఈ రోజు అనగా ఆగస్ట్ 26 వ తేదీన సాయంత్రం 5 గంటలకు కర్నూల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీ లో నిఖిల్ హీరోగా నటించిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: