కార్తికేయ 2 హిట్.. అది ఇప్పుడే చెప్పలేమంటున్న దర్శకుడు?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ చందు మొండేటి. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే చందు మొండేటి సినిమా అంటే చాలు హీరో హీరోయిన్లు ఎవరు అని కూడా చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు అని చెప్పాలి. ఆ రేంజ్ లో తన సినిమాలతో ప్రేక్షకుల పై ప్రభావం చూపించాడు.  అయితే గత కొంత కాలం నుంచి మాత్రం సరైన హిట్ లేక చందు మొండేటి కాస్త వెనుకబడి పోయాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల తనకు ఎంతో కలిసి వచ్చిన కార్తికేయ సినిమా సీక్వల్  తీసి హిట్ కొట్టాడు.

 అప్పట్లో విడుదలైన కార్తికేయ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా అంతకు మించిన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు అని కార్తికేయ 2 సినిమా మరోసారి నిరూపించింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడమే కాదు లాభాలు కూడా తెచ్చిపెట్టింది అని చెప్పాలి. కేవలం సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా సత్తా చాటుతూ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో కార్తికేయ 3 గురించి ఒక చిన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు.

 సముద్ర గర్భంలో దాగి ఉన్నా అయోధ్య మిస్టరీ ఛేదించేందుకు కార్తికేయ సిద్ధమైపోయాడు అంటూ చూపించాడు. దీంతో కార్తికేయ 3 ఎప్పుడు ఉంటుంది అన్న చర్చ కూడా మొదలయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు దర్శకుడు చందు మొండేటి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు  తన తర్వాత ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చాడు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక లవ్స్టోరీ చేయబోతున్నట్లు తెలిపాడు. ఇక కార్తికేయ 2 కొనసాగింపుగానే సీక్వెల్ 3 కూడా ఉంటుందని తెలిపాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు చేస్తాము అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేముఅంటూ తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: