ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. జబర్దస్త్ స్టేజ్ పై ముగ్గురు చంద్రముఖిలు?

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని కార్యక్రమాల లాగానే ఒక సాదాసీదా కార్యక్రమం గా ప్రారంభమైన జబర్దస్త్ ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించింది. సినిమా లో ఎక్కడా కనిపించని సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది. గత తొమ్మిదేళ్ల నుంచి కూడా తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తుంది అని చెప్పాలి.

 అయితే జబర్దస్త్ లో ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్లతో ప్రేక్షకులకు వినూత్నమైన ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు ఎంతో మంది కమెడియన్స్. అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ కామెడీయన్స్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకరు. ఒక స్కిట్ తో మరో స్కిట్ కి సంబంధం లేకుండా ప్రతి వారం కూడా సరికొత్తగా  అలరిస్తాడూ. ఇకపోతే ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్  కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో భాగంగా మరో సారి బుల్లెట్ భాస్కర్ స్కిట్ షో మొత్తానికి హైలెట్గా నిలిచేలా కనిపించింది.

 సాధారణంగా ఒక స్కిట్ లో ఒకరు సరికొత్త గెటప్ వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో మాత్రం ఏకంగా ముగ్గురు లేడీ కమెడియన్స్ అందర్నీ భయపెట్టే గెటప్లో కనిపించారు. రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో చంద్రముఖి గెటప్ వేసుకొని రోహిణి మొదట ఎంట్రీ ఇస్తోంది. ఇక ఆ తర్వాత వర్షా కూడా చంద్రముఖి గెటప్ లోనే వస్తుంది. అటు వెంటనే ఫైమా సైతం చంద్రముఖి గెటప్ లో ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న వారందరూ కేకలు పెట్టేస్తారు. ఈ ముగ్గురు కూడా చంద్రముఖి గెటప్ లో చేసిన పర్ఫామెన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఒకేసారి జబర్దస్త్ స్టేజ్ పై ముగ్గురు చంద్రముఖి లు కనిపించడంతో వాళ్లు జబర్దస్త్ స్టేజ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: