హీరో నితిన్ రూటు తప్పాడా... కాకపోతే ఏంటిది ?

VAMSI
తెలుగు సినిమా హీరోలలో  మినిమం గ్యారంటీ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో యంగ్ హీరో నితిన్ ఒకరు. ప్రస్తుతం నితిన్ వయసు 40 సంవత్సరాలు కావస్తోంది. ఇతని కెరీర్ లో 29 చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్ లో కొత్త టాలెంటెడ్ నటుల నుండి విపరీతమైన పోటీ ఉన్న కారణంగా ఇండస్ట్రీలో నిలబడాలంటే కనీసం రెండు సినిమాల్లో ఒకటి అయినా హిట్ పడాల్సిందే. కానీ నితిన్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కెరీర్ ఆరంభం నుండి పడుతూ లేస్తూ వస్తున్నాడు. రీసెంట్ ఫామ్ ను కనుక పరిశీలిస్తే 2020 లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత సరైన హిట్ లేదు. మాస్ట్రో రూపంలో మంచి మ్యూజికల్ హాట్ వచ్చిన అది రీమేక్ మూవీ కాబట్టి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు.
సో... తన నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలన్న ఉద్దేశ్యంతోనే కొత్త డైరెక్టర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ తో వారం క్రిందట ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మొదటి రోజు నుండే ఈ సినిమా నెగటివ్ టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల కోసం ఆపసోపాలు పడుతోంది. మొత్తానికి నితిన్ కెరీర్ లో మరో ప్లాప్ మూవీ పడింది. ఈ సినిమాలో నితిన్ ఒక కలెక్టర్ గా నటించాడు. అయితే ఇలాంటి కథలు ఇంతకు ముంచు చాలానే రావడంతో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. టాలీవుడ్ పరిస్థితిని కళ్లారా చూస్తున్న నితిన్ ఎందుకు ఇలాంటి కథను ఎంచుకున్నాడు అన్నది అభిమానులకు సైతం అర్ధం కావడం లేదు.
సరికొత్త కాన్సెప్ట్ లు ఎంచుకుని చిన్న చిన్న హీరోలు సైతం బ్లాక్ బస్టర్ లు కొడుతూ ఉంటే నితిన్ ఇంకా ఇలాంటి మూస కథలలోని ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే నితిన్ పూర్తిగా రూట్ తప్పినట్లున్నాడు. కాకపోతే ఇలాంటి కథలను ఎంచుకుని ఇంకా తన కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంటాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: