అమీర్ ని నాశనం చేశా.. నెక్స్ట్ షారుఖ్, సల్మాన్: కమల్

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'లాల్ సింగ్ చడ్డా'. టామ్ హ్యాంక్స్ నటించిన 'ఫారెస్ట్ గంప్' సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది.కరీనా కపూర్ ఇంకా నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11 వ తేదీన విడుదలైంది. ప్రేక్షకులను అస్సలు మెప్పించలేకపోయింది.ఈ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే చాలా మిక్స్‌డ్ రివ్యూస్ లభించాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా పరాజయం పాలైంది. ఇక ఈ సినిమా పరాజయం పాలవ్వడానికీ తానే ముఖ్య కారణమని బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ ఆర్. ఖాన్ చెప్పాడు.ఇక ఆమిర్ ఖాన్ కెరీర్‌ను పూర్తిగా తానే నాశనం చేశానని కేఆర్‌కే తెలిపాడు. షారూఖ్ ఖాన్ ఇంకా సల్మాన్ ఖాన్‌లకు ఇదే గతి పట్టిస్తానన్నాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని కూడా పెట్టాడు. ''ఓ సోదరుడా షారూఖ్ ఖాన్. అమిర్ ఖాన్ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశాను. ఇప్పుడు నీ వంతు వచ్చింది.నీ 'పఠాన్' తో పాటు ఇంకా సల్మాన్ చిత్రం మిగిలి ఉంది.అందుకే మీరిద్దరు కూడా సినిమాలను త్వరగా విడుదల చేయండి.నేను వేచి ఉండలేకుండా పోతున్నాను. ఇక మీ సినిమా విజయం సాధిస్తుందని 1శాతం సందేహం ఉన్న సరే, షారూఖ్ ఖాన్‌ని మీ చిత్రంలో అతిథి పాత్ర చేయమని అడగండి. ఇక అప్పుడు ఆ మూవీ తప్పకుండా 100శాతం పరాజయం పాలవుతుంది'' అని కమల్ ఆర్. ఖాన్ తెలిపాడు. 


'లాల్ సింగ్ చడ్డా' సినిమా రాఖీ కానుకగా థియేటర్స్‌లోకి వచ్చింది. మెట్రో ప్రాంతాల్లోని ప్రేక్షకులు ఈ సినిమాని బాగానే ఆదరించారు. అయితే మాస్ సర్క్యూట్స్‌లోని వారి నుంచి చిత్రానికి చాలా తక్కువ స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు మొత్తం రూ.11.70కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో మొదటి రోజే దారుణంగా 1300 షోస్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో ఆ కలెక్షన్స్ అనేవి మరింత తగ్గాయి. ఫలితంగా ఈ చిత్రం రెండో రోజు కేవలం రూ. 7.26కోట్ల కలెక్షన్స్‌ను ఇంకా మూడో రోజు రూ. 9కోట్లను మాత్రమే సాధించింది. మూడు రోజులకు గాను ఈ సినిమా కేవలం రూ. 27.96కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆమిర్ ఖాన్ స్టార్‌డమ్‌తో పోల్చుకుంటే ఈ కలెక్షన్స్ మూడు రోజులకు గాను రూ. 70కోట్లను దాటాలి. కానీ, ఈ సినిమా సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: