మరో మూవీ ని లైన్ లో పెట్టిన ప్రభాస్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ 'మిర్చి' మూవీ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ని పెంచుకున్నాడు. బాహుబలి మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీ లలో అంతకుమించిన మూవీ లలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ , యు వి.క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పటికే మూడు మూవీ లలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ మొదటి సారిగా యు వి క్రియేషన్స్ బ్యానర్ లో మిర్చి మూవీ లో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది.

ఆ తర్వాత ప్రభాస్ , యూ వి క్రియేషన్స్ బ్యానర్ లో సాహో మూవీ లో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైన పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రభాస్ తాజాగా యు వి క్రియేషన్స్ బ్యానర్ లో రాధే శ్యామ్ అనే ప్రేమకథా చిత్రంలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మూడు సార్లు యు వి క్రియేషన్స్ బ్యానర్ లో నటించిన ప్రభాస్ మరో సారి కూడా ఈ క్రేజీ బ్యానర్ లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొద్ది రోజుల్లోనే రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ప్రభాస్ మరో మూవీ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: