మాచర్ల నియోజకవర్గం: రొటీన్ ఫార్ములా.. మరో ప్లాప్?

Purushottham Vinay
నితిన్ హీరోగా ఈ రోజు విడుదల అయిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం. ఇక కమర్షియల్ సినిమా అంటే నాలుగు పాటలు, ఐదు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు, చివర్లో ఒక సందేశం పడేస్తే చాలనుకునే ఆలోచనతో తీసిన సినిమా. ఈ మాచర్ల నియోజికవర్గం కూడా అలాంటిదే. ఇలాంటి ప్యాకేజీతో వచ్చిన చాలా సినిమాలు కూడా అపజయం మూటకట్టుకున్నప్పటికీ మళ్ళీ అదే రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములాతో సీన్లు అల్లుకొని థియేటర్లో ప్రేక్షకులని బాగా నిద్రపుచ్చిన చిత్రమిది. ఒక్క మెతుకుతో అన్నం ఉడికిందో లేదో ఈజీగా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీన్ తోనే సినిమా జాతకం తెలిసిపోతుంది. అమ్మాయిలని ఏడిపిస్తూ ఒక బ్యాచ్ ఇంకా ఆ బ్యాచ్ ని చావగ్గొట్టి హీరో ఎంట్రీ. వెంటనే ఫస్ట్ సాంగ్. ఇక హీరో పరిచయం ఎంత రొటీన్ గా ఉంటుందో తర్వాత వచ్చే సీన్స్ కూడా అంతే పరమ రొటీన్ గా అనిపిస్తాయి. ఇదంతా కూడా టైం పాస్ వ్యవహారమని ప్రేక్షకుడికి అర్ధమైపోతుంది. పోనీ ఆ టైం పాస్ లో అయినా పాసైపోయిందా అంటే అదీ లేదు. లవ్ కామెడీ ఇంకా లవ్ ట్రాక్ పండలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనవసరమైన వ్యవహారం అనిపిస్తుంది. హీరో మాచర్ల వచ్చిన తర్వాత కొత్తగా ఏదైనా చూపిస్తారా అంటే అక్కడ కూడా నిరాశే ఉంది. రొటీన్ హీరో విలన్ వార్ లా అడుగుకో ఫైట్ అన్నట్టు సినిమాని ముగించేశారు.


ఒక కలెక్టర్ చొరవ తీసుకొని ఎన్నికలు జరపడం అనే పాయింట్ అయితే బావుంది. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం ఏ మాత్రం అస్సలు ఆకట్టుకోదు. హీరో నితిన్ ఎనర్జిటిక్ గా వున్నాడు. ఐతే అతడి పాత్రకి బాడీ లాంగ్వేజ్ కి అయితే అస్సలు మ్యాచ్ కాలేదు . డ్యాన్సులు ఫైట్లు కొంచెం జోష్ గా చేశాడు. కృతి శెట్టి అందంగా వుంది. కేథరిన్ పాత్ర అయితే అయోమయంగా వుంటుంది. సముద్రఖని అయితే తన అనుభవం చూపించారు. డీసెంట్ విలన్ గా ఆయన ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ ఇంకా శ్యామల ట్రాక్ వర్క్ అవుట్ కాలేదు. పైగా కాస్త ఇన్ డీసెంట్ గా కూడా వుంది. మురళీ శర్మ ఇంకా రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ప్రభావాన్ని చూపలేదు. మిగతా వారి కోసం పెద్దగా చెప్పుకోవాడానికి కూడా ఏమీ లేదు.ఇక నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి.


ప్రసాద్ మూరేళ్ళ కెమెరాపనితనం కొంచెం నీట్ గా వుంది. ఫైట్ మాస్టర్ కూడా బాగానే కష్టపడ్డారు. ఇక దర్శకుడే ఎడిటర్. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగం ట్రిమ్ చేసే అవకాశం కూడా వుంది. సాగర్ అందించిన నేపధ్య సంగీతం బావుంది కానీ పాటలు అయితే ఆకట్టుకోవు. రారా రెడ్డి పాటలో రానురాను బిట్ అయితే ఊపుతెచ్చింది. ఇంకా కొన్ని డైలాగ్స్ నాసిరంగా వున్నాయి. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తన తొలి సినిమాతోనే కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని రెగ్యులర్ కొలతలు వేసుకుని మరీ ఓ రొట్ట రొటీన్ సినిమా తీశాడు. అయితే ఒక కమర్షియల్ సినిమా ఎలా వుండకూడదో అనడానికి ఉదాహరణగా మిగిలిపోయింది ఈ మాచర్ల నియోజక వర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: